Ts News: ఎంజీబీఎస్‌లో డిజిటల్‌ పేమెంట్‌ సేవలు.. అందుబాటులోకి తీసుకొచ్చిన టీఎస్‌ఆర్టీసీ

తెలంగాణ ఆర్టీసీ డిజిటల్‌ చెల్లింపుల విధానంలో మరో అడుగు ముందుకేసింది. హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌లో క్యూఆర్‌ కోడ్‌, యూపీఐ ద్వారా చెల్లింపులు

Updated : 27 Oct 2021 05:13 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ డిజిటల్‌ చెల్లింపుల విధానంలో మరో అడుగు ముందుకేసింది. హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌లో క్యూఆర్‌ కోడ్‌, యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే విధానానికి శ్రీకారం చుట్టింది. ఎంజీ బస్‌ స్టేషన్‌లోని టికెట్‌ కేంద్రాల్లో క్యూఆర్‌ కోడ్‌, యూపీఐ ద్వారా చెల్లింపుల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. టికెట్‌ రిజర్వేషన్‌, పార్సిల్‌, కార్గో సర్వీసులకు ఈ డిజిటల్‌ పేమెంట్స్‌ సేవలు వర్తించనున్నాయి. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌ స్టేషన్‌ (జేబీఎస్‌)లో ఈ తరహా చెల్లింపు సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని