Ap News: ఆన్‌లైన్‌ టికెట్లపై ప్రత్యేక నిఘా: పేర్ని నాని

దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ 4వేల ప్రత్యేక బస్సులు నడుపుతోందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. గన్నవరంలో మంత్రి మీడియాతో మాట్లాడారు

Published : 09 Oct 2021 02:17 IST

గన్నవరం: దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ 4వేల ప్రత్యేక బస్సులు నడుపుతోందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. గన్నవరంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నామని చెప్పారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. ఇదే అదునుగా అధిక ధరలు వసూలు చేసే ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం రేపు ప్రత్యేక వాట్సాప్ నంబర్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆన్‌లైన్‌ టిక్కెట్లపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా ఉంటుందని పేర్ని నాని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని