
Updated : 21 Oct 2021 13:08 IST
TS News: ఇంటర్ మొదటి ఏడాది పరీక్షల రద్దుకు హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తల్లిదండ్రులు సంఘం ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. ప్రమోట్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దని పిటిషనర్ కోర్టును కోరారు. పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పాస్ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది రాపోలు భాస్కర్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇంటర్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా విద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారు. కాగా రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
Tags :