NGT: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై ఎన్జీటీ విచారణ

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం విచారణ చేపట్టింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని దాఖలైన పిటిషన్లపై

Updated : 27 Aug 2021 15:48 IST

దిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం విచారణ చేపట్టింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీ విచారణ చేసింది. కోస్గి వెంకటయ్య పిటిషన్‌లో ఇంప్లీడ్‌ అయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో తమకు నష్టం జరుగుతుందని ఏపీ స్పష్టం చేసింది. ఏపీ వాదనలు విన్న ఎన్జీటీ ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతి ఇచ్చింది. కమిటీ నోడల్‌ ఏజెన్సీగా ఉన్న తెలంగాణ గనుల శాఖను తొలగించిన ఎన్జీటీ.. కేఆర్‌ఎంబీని నియమించింది. ప్రాజెక్టుపై తనిఖీ కమిటీ నివేదికను కేంద్ర పర్యావరణ శాఖ ఇప్పటివరకూ ఇవ్వకపోవడంపై ఎన్జీటీ అసహనం వ్యక్తం చేసింది. త్వరగా పర్యావరణ ఉల్లంఘనలపై నివేదిక ఇవ్వాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని