AP News: బస్సు ప్రమాదంపై ప్రధాని విచారం.. మృతులకు పరిహారం ప్రకటన!

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని....

Published : 15 Dec 2021 20:16 IST

దిల్లీ: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ప్రధాని కార్యాలయం తెలుగులో ట్వీట్‌ చేసింది. ఈ దుర్ఘటనలో మృతులకు ఒక్కొక్కరికి ₹2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నిధుల నుంచి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు పీఎంవో వెల్లడించింది.

జల్లేరులో జంగారెడ్డి గూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వంతెన పైనుంచి ప్రమాదవశాత్తు వాగులో పడిపోవడంతో తొమ్మిది మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వారందరినీ జంగారెడ్డిగూడెంలో ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, మృతులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ₹5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని