TS News: వనమా రాఘవ ఇంటికి పోలీసుల నోటీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడు వనమా

Updated : 07 Jan 2022 16:08 IST

పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడు వనమా రాఘవ ఆచూకీపై ఉత్కంఠ కొనసాగుతోంది. అతడిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్‌ చేయకపోవడంపై విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్యే కుమారుడు కావడంతోనే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. రాఘవపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో కొత్తగూడెం బంద్‌ను కొనసాగిస్తున్నారు. తన కుమారుడిని అప్పగిస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చెప్పినా ఇప్పటి వరకు రాఘవ పోలీసుల ఎదుటకు రాలేదు.

ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు రాఘవ ఇంటికి నోటీసులు అతికించారు. 2001లో నమోదైన కేసులో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల్లోపు రావాలని అందులో పేర్కొన్నారు. మణుగూరు ఏఎస్పీ శబరీష్‌ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని