Polytechnic seat allotment: తెలంగాణలో పాలిటెక్నిక్‌ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి

తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. ఈ ఏడాది పాలిసెట్‌లో 75,669 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 120...

Updated : 29 Aug 2021 04:24 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. ఈ ఏడాది పాలిసెట్‌లో 75,669 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 120 కళాశాలల్లో 24,401 (83.98 శాతం) సీట్లు భర్తీ కాగా.. 4,653 (16.02 శాతం) సీట్లు మిగిలిపోయినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని 54 ప్రభుత్వ కళాశాలల్లో 11,874 సీట్లు ఉండగా.. 11,624 కేటాయించినట్లు చెప్పారు. 65 ప్రైవేట్ కళాశాలల్లోని 16,950 సీట్లకు 12,550 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. తుది విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 31లోగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సెప్టెంబరు 1 నాటికి కళాశాలల్లో చేరాలని మిత్తల్ తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి 4వ తేదీ వరకు ఓరియంటేషన్ నిర్వహించి.. 6 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని