CJI: పొన్నవరం చేరుకున్న సీజేఐ.. ఘనస్వాగతం పలికిన గ్రామస్థులు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ తన స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరం చేరుకున్నారు.

Updated : 24 Dec 2021 13:31 IST

పొన్నవరం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ తన స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరం చేరుకున్నారు. సీజేఐ హోదాలో తొలిసారిగా గ్రామానికి వచ్చిన సీజేఐకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. జస్టిస్‌ ఎన్‌వీ రమణ దంపతులను ఎడ్ల బండిపై ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకెళ్లారు. మేళతాళాలు, జనసందోహం నడుమ సీజేఐను గ్రామంలోకి ఆహ్వానించారు. అనంతరం పొన్నవరంలోని శివాలయంలో ఆయన ప్రత్యేక పూజులు నిర్వహించారు. అనంతరం గ్రామస్థుల పౌరసన్మానాన్ని జస్టిస్‌ ఎన్‌వీ రమణ దంపతులు స్వీకరించనున్నారు. గ్రామంలో ఆయన నాలుగు గంటలపాటు గడపనున్నారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో పొన్నవరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు