Adar Poonawalla: ఒమిక్రాన్‌ను పడగొట్టిన బూస్టర్ డోసు.. సరదా మీమ్ షేర్ చేసిన పూనావాలా
బూస్టర్ డోసులు గురించి గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న్పటికీ.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి రావడంతో అది కాస్తా తీవ్రమైంది.
ముంబయి: బూస్టర్ డోసుల గురించి గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న్పటికీ.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి రావడంతో అది కాస్తా తీవ్రమైంది. కొన్ని దేశాలు ఇప్పటికే తమ ప్రజలకు బూస్టర్లు అందిస్తున్నాయి. భారత్ కూడా ఆ దిశగానే చర్చిస్తోంది. తాజాగా సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా ఈ సందర్భానికి అనువైన మీమ్ ఒకటి షేర్ చేశారు. చూడటానికి సరదాగానే ఉన్న ఆ వీడియో.. బూస్టర్లు తీసుకోవాల్సిన ఆవశ్యతను వెల్లడిచేస్తోంది. ఆ మీమ్‌ను యూఎస్‌కు చెందిన జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రూపొందించింది.
ఆ వీడియోలో ఒక అబ్బాయి డెల్టా, ఒమిక్రాన్ అనే పేర్లతో ఉన్న ఇద్దరు వ్యక్తులతో పోరాడుతుంటాడు. వారిద్దరు అతడి వైపునకు వస్తుండగా.. వారి నుంచి తప్పించుకునేందుకు పక్కనే ఉన్న బకెట్(వ్యాక్సిన్)ను వారివైపు విసురుతాడు. దాంతో డెల్టా పేరుతో ఉన్న వ్యక్తి ఆ దెబ్బకు కిందపడిపోతాడు. కానీ ఒమిక్రాన్ పేరుతో ఉన్న రెండో మనిషి మాత్రం తప్పించుకొని ఆ బాలుడివైపు దూసుకొస్తూ ఉంటాడు. ఆ వెంటనే ఆ వ్యక్తిని ఎదుర్కొవడానికి పక్కనే ఉన్న మరో బకెట్(బూస్టర్ డోసు)ను విసురుతాడు. ఈ సారి విసిరిన బకెట్ దెబ్బ గురి తప్పలేదు. ఒమిక్రాన్ కిందపడిపోయాడు. 1990ల్లో ‘హోం అలోన్ ’ అనే చిత్రంలోని వీడియో క్లిప్‌ను ఇలా మీమ్‌గా రూపొందించారు. దీనిని షేర్ చేసిన పూనావాలా .. ‘ఏం జరుగుతోంది’ అంటూ వ్యాఖ్యను జోడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్