
Charanjit Singh Channi: చిన్నారులను హెలికాప్టర్‌లో తిప్పిన పంజాబ్ సీఎం
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ కొందరు చిన్నారులకు ఎనలేని ఆనందాన్ని కల్పించారు. వారిని తన హెలికాప్టర్‌లో ఎక్కించుకొని తిప్పారు. హెలికాప్టర్‌లో కూర్చున్న తర్వాత ఆ పిల్లల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను చరణ్‌జిత్ చన్నీ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘ఇది ప్రజా ప్రభుత్వం. పిల్లలతో ఛాపర్ రైడ్‌ను పంచుకోవడం సంతోషంగా ఉంది. అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడం ద్వారా వారికి ఉజ్వల, సుసంపన్నమైన భవిష్యత్తును అందించడమే మా ప్రయత్నం’ అని పేర్కొంటూ వీడియోను ట్వీట్ చేశారు.
చిన్నారులు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత మీడియా ప్రతినిధులు వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా పిల్లలు హర్షం వ్యక్తం చేశారు. హెలికాప్టర్‌ను మొదటిసారి ఎక్కామని.. అది కూడా ముఖ్యమంత్రితో ప్రయాణించడం ఆనందంగా ఉందన్నారు.
► Read latest General News and Telugu News