
Updated : 22 Dec 2021 16:29 IST
AP News: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘పుష్ప’ చిత్రబృందం
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని పుష్ప చిత్రబృందం దర్శించుకుంది. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో దర్శకుడు సుకుమార్, నిర్మాత నవీన్, నటుడు సునీల్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్టు చిత్రబృందం తెలిపింది. పుష్ప చిత్రం పార్ట్-2 నిర్మాణాన్ని ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టనున్నట్లు వెల్లడించింది.
Tags :