
PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు
తిరుమల: భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆమె తిరుమల స్వామి వారి దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్ర పటాన్ని అర్చకులు ఆమెకు అందజేశారు.
సింధుతో పాటు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, భాజపా నేత విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.