Updated : 21/11/2021 14:53 IST

AP Floods: వరదల ఎఫెక్ట్‌.. తేలియాడుతున్న రైల్వే ట్రాక్‌లు!

నెల్లూరు: వరదల ప్రభావంతో నెల్లూరు జిల్లా పడుగుపాడు సమీపంలో రైలు పట్టాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.  శనివారం రాత్రి రైలు ట్రాక్‌పైకి నీళ్లు చేరడాన్ని సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అరగంట వ్యవధిలోనే ట్రాక్‌పైకి నీరు చేరింది. దీంతో చెన్నై- విజయవాడ వెళ్లే మార్గంలో రైళ్లను నిలిపివేశారు. వరద తీవ్రత పెరిగిన కొద్దీ కింద ఉన్న రాళ్లు, కంకర కొట్టుకుపోవడందో ట్రాక్‌ గాల్లో వేలాడుతోంది.  పడుగుపాడు వద్ద మూడు ట్రాక్‌లు ఉండగా రెండు ట్రాక్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 

దెబ్బతిన్న ట్రాక్‌ల పునరుద్ధరణకు రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టేందుకు వీలుగా పెద్ద సంఖ్యలో కార్మికులు అక్కడికి చేరుకున్నారు. జేసీబీల సాయంతో పనులు ప్రారంభించారు. సాయంత్రానికి ఒక్క ట్రాక్‌నైనా అందుబాటులోకి తీసుకొచ్చి రైళ్ల రాకపోకలకు వీలు కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. విజయవాడ రైల్వే డీఆర్‌ఎం, ఏడీఆర్‌ఎం, సాంకేతిక సిబ్బంది కాసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు.

పడుగుపాడు వద్ద ట్రాక్‌ దెబ్బతినడంతో ఇటు నెల్లూరు, అటు ఒంగోలు సహా మరికొన్ని రైల్వేస్టేషన్లలో రైళ్లను నిలిపేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నెల్లూరు సహా సమీప ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు పడుగుపాడు వద్ద ఆగిన రైళ్లు దిగి ట్రాక్‌ వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నారు. 


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని