
Rain Alert: రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
హైదరాబాద్: తెలంగాణలో రానున్న 3-4 రోజుల వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈనెల 6న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని.. ఆ తర్వాత అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది.
గురువారం రాత్రి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా ఎడతెరిపి లేకుండా కురిసిన జోరువానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరదనీరు చేరడంతో ప్రధాన మార్గాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. అరగంటలోనే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలానగర్లో 7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. నగరంలోని మిగతా ప్రాంతాల్లో 5 నుంచి 4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.