Hyderabad: హైదరాబాద్‌లో వర్షం.. జలమయమైన రహదారులు

నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గత నాలుగు రోజులుగా ఉక్కపొతతో సతమతమైన నగర వాసులు సాయంత్రం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం పొందారు.

Updated : 14 Aug 2021 18:37 IST

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గత నాలుగు రోజులుగా ఉక్కపొతతో సతమతమైన నగర వాసులు సాయంత్రం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. నగరంలోని ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, లక్డికాపూల్‌, నాంపల్లి, మాదాపూర్‌, ఎర్రగడ్డ, మియాపూర్‌, మదీనాగూడ, చందానగర్‌, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, సైఫాబాద్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లోని రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని