Corona Vaccine: టీకా తీసుకోకపోతే రేషన్‌ బంద్‌ ప్రచారం.. ఆరోగ్య కేంద్రానికి పోటెత్తిన ప్రజలు

కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకపోతే రేషన్‌ నిలిపేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆరోగ్య కేంద్రానికి ప్రజలు

Updated : 30 Aug 2021 13:36 IST

నవీపేట్‌: కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకపోతే రేషన్‌ నిలిపేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆరోగ్య కేంద్రానికి ప్రజలు పోటెత్తిన ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. నవీపేట్ మండల కేంద్రంలో రేపటి నుంచి టీకా ఇవ్వరని.. అది తీసుకోకపోతే రేషన్‌ నిలిపేస్తారని కొందరు వదంతులు సృష్టించారు. దీంతో 700 మందికి పైగా ప్రజలు స్థానిక ఆరోగ్య కేంద్రానికి పోటెత్తారు. ఉదయాన్నే వచ్చి క్యూలైనల్లో నిల్చుని ఇబ్బందులు పడ్డారు. టీకా కోసం పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో 500 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని