cyclone Gulab: తెలంగాణపై తగ్గిన ‘గులాబ్‌’ తుపాను ప్రభావం

గులాబ్‌ తుపాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై  తగ్గిపోయిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఇది తీవ్ర అల్పపీడనంగా విదర్భ, మరఠ్వాడ పరిసర

Updated : 28 Sep 2021 21:34 IST

హైదరాబాద్‌: గులాబ్‌ తుపాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై  తగ్గిపోయిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఇది తీవ్ర అల్పపీడనంగా విదర్భ, మరఠ్వాడ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైనట్టు వాతావరణశాఖ సంచాలకులు డాక్టర్‌ నాగరత్నం తెలిపారు.  ఇప్పటి వరకు ఈ సీజన్‌లో సాధారణం కన్నా 40శాతం అధిక వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు. వాయువ్య పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ బెంగాల్‌ తీరంలో అల్పపీడనం ఏర్పడినట్టు పేర్కొన్నారు. రాగల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. మరో వైపు వర్ష తీవ్రత తగ్గినప్పటికీ హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాల గేట్లను ఎత్తివేయడంతో మూసీకి వరద పోటెత్తుతోంది. చాదర్‌ఘాట్‌, మూసారాంబాగ్‌ వద్ద వంతెనలను ఆనుకుని మూసీ ప్రవహిస్తోంది. మూసారాంబాగ్‌ వంతెనతో పాటు చాదర్‌ఘాట్‌ చిన్న బ్రిడ్జిపైకి రాకపోకలను నిలిపివేశారు. దీంతో కోఠి-చాదర్‌ఘాట్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని