TS News: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం విడుదల

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఒక్కో రైతు కుటుంబానికి రూ.6లక్షల

Published : 26 Dec 2021 01:38 IST

హైదరాబాద్‌: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఒక్కో రైతు కుటుంబానికి రూ.6లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నారు. మొత్తం 133 కుటుంబాలకు రూ.7.95 కోట్లు విడుదల చేశారు. ఈమేరకు నిధుల విడుదలపై విపత్తుల నిర్వహణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

వికారాబాద్‌ జిల్లాలో 27 కుటుంబాలకు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 23 కుటుంబాలకు, నల్గొండలో 17, భూపాపలపల్లి 12, జనగాంలో 10, హన్మకొండ, ములుగు జిల్లాల్లో 9 కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఖమ్మంలో 6, కొత్తగూడెంలో 5, వరంగల్‌ లో 3, నిజామాబాద్ లో 3 కుటుంబాలకు పరిహారం అందించనున్నారు. మహబూబాబాద్, మెదక్, నారాయణపేట జిల్లాల్లో రెండు చొప్పున కుటుంబాలకు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కో కుటుంబానికి పరిహారం అందనుంది.  ఈ మేరకు విపత్తు నిర్వహణా శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని