TS News: గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు నిధుల విడుదల 

గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.432 కోట్ల నిధులు విడుదల చేసింది.

Updated : 21 Aug 2021 13:09 IST

హైదరాబాద్‌: గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.432 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంటు నిధులు విడుదలయ్యాయి. గ్రామ పంచాయతీలకు రూ.182.49 కోట్లు కాగా, మండల పరిషత్‌లకు రూ.124.11 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ. 125.95 కోట్లు విడుదల చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని