Tamilisai: పరువునష్టం కేసులో గవర్నర్‌ తమిళిసైకి ఊరట

వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌పై వ్యాఖ్యలు చేసినందుకు ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లఫె్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్‌పై దాఖలైన పరువునష్టం కేసు కొట్టివేస్తూ మద్రాస్‌ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులిచ్చింది. త

Updated : 29 Sep 2021 08:33 IST

ఈనాడు డిజిటల్‌, చెన్నై: వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌పై వ్యాఖ్యలు చేసినందుకు ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్‌పై దాఖలైన పరువునష్టం కేసు కొట్టివేస్తూ మద్రాస్‌ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులిచ్చింది. తమిళిసై 2017లో భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌ కట్టపంచాయత్తు (దాదాగిరి) చేస్తున్నారని మీడియాలో వ్యాఖ్యానించారు. దీనిపై వీసీకే సభ్యుడు తాటి కార్తికేయన్‌ కాంచీపురం కోర్టులో పరువునష్టం వ్యాజ్యం వేశారు. విచారణకు తమిళిసై హాజరుకావాలంటూ కోర్టు సమన్లు పంపింది. సమన్లు, కేసును రద్దు చేయాలని కోరుతూ ఆమె మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. విచారణలో భాగంగా న్యాయమూర్తి జస్టిస్‌ దండపాణి మాట్లాడుతూ.. రాజ్యాంగం వాక్‌ స్వాతంత్య్రం, వ్యక్తీకరణ స్వేచ్ఛను అందించినప్పటికీ వాటికి పరిమితులు విధించిందన్న విషయాన్ని గుర్తుచేశారు. కేసు కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని