HYD: మూసారాంబాగ్‌ వంతెనపై కొనసాగుతున్న ఆంక్షలు

గులాబ్‌ తుపాను ప్రభావంతో నగరంలో కురిసిన భారీ వర్షాలకు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాలకు వరద పోటెత్తింది. ..

Updated : 29 Sep 2021 12:33 IST

హైదరాబాద్‌: గులాబ్‌ తుపాను ప్రభావంతో నగరంలో కురిసిన భారీ వర్షాలకు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో జంట జలాశయాల గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడంతో మూసీలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా మూసారాంబాగ్‌ వంతెనపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. వంతెనపై నుంచి వాహనాల రాకపోకలకు అనుమతి నిరాకరిస్తున్నారు. వరద ఉద్ధృతి తగ్గిన తర్వాతే వాహనాలకు అనుమతి ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. నిన్న మధ్యాహ్నాం నుంచే వరద కొనసాగుతుండతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మూసారాంబాగ్‌ వంతెనతో పాటు చాదర్‌ఘాట్‌ చిన్న బ్రిడ్జిపైకి రాకపోకలను మంగళవారం మధ్యాహ్నం నుంచి నిలిపేసిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని