Updated : 10/11/2021 13:46 IST

TS News: ప్రతిగింజా కొంటామంటూనే సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు: రైస్‌ మిల్లర్ల సంఘం

హైదరాబాద్‌: బాయిల్డ్‌ రైస్‌, రా రైస్‌ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని చర్చించకుండా రైతులు, మిల్లర్లను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని రైస్‌ మిల్లర్ల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. దక్షిణ భారత రైస్‌ మిల్లర్ల సంఘాల సమాఖ్య ప్రతినిధులు.. ఇవాళ బేగంపేట టూరిజం ప్లాజా హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ధాన్యం ప్రతిగింజా కొంటామంటూనే తగిన ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం అన్నదాతలను సంక్షోభంలోకి నెట్టేస్తోందని సమాఖ్య అధ్యక్షుడు తూడి దేవేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో గన్నీ సంచులు, హమాలీల కొరత, రవాణా, గోదాముల సమస్యలు వేధిస్తున్నాయన్న ఆయన.. బియ్యం సేకరణ వేగవంతం చేయకపోవడంతో రైస్‌మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 

ధాన్యం కొనుగోళ్లలో తాత్సారం చేయొద్దని దేవేందర్‌ కోరారు. ఇతర రాష్ట్రాల్లో వినియోగం లేదని కేంద్ర ప్రభుత్వం ధాన్యం తీసుకోవట్లేదన్న ఆయన‌.. ఎప్పటికప్పుడు విదేశాలకు ఎగుమతులు చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం అనుమతిస్తే తామే విదేశాలకు ఎగుమతి చేసుకుంటామని తెలిపారు. రైతులు నేరుగా మిల్లర్లకు విక్రయించే వ్యవస్థ కావాలన్నారు. ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాలు కూడా కొనసాగాలన్నాలని దేవేందర్‌ కోరారు. వీటితో పాటు అంతర్జాతీయ ఎగుమతులను ప్రోత్సహించాలన్నారు. రైతుల సంక్షేమం, వినియోగదారులకు లాభం చేకూరే కోణంలో కేంద్రం ఆలోచన చేయాలని దేవేందర్‌ విజ్ఞప్తి చేశారు. ధాన్యం సేకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని