
Tirumala: తిరుమలలో జనవరి 11 నుంచి 14 వరకు గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు: తితిదే
తిరుమల: తిరుమలలో జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు చేస్తున్నట్టు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 13న వైకుంఠ ఏకాదశి, జనవరి 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని 11 నుంచి 14వ తేదీ వరకు వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్‌ను తితిదే రద్దు చేసింది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తుల వసతికి పెద్దపీట వేస్తూ తిరుమలలోని అన్ని గదులను కరెంట్ బుకింగ్ ద్వారా కేటాయించాలని తితిదే నిర్ణయించింది. ఎమ్‌బీసీ-34, కౌస్తుభం విశ్రాంతి భవనం, టీబీసీ కౌంటర్, ఏఆర్‌పీ కౌంటర్లలో 2022 జనవరి 11వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 14వ తేదీ అర్ధరాత్రి 12గంటల వరకు గదులు కేటాయించబోమని అధికారులు తెలిపారు. జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ప్రివిలేజ్ ఉండదని స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.