ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వీఆర్‌ఎస్‌కు ఆమోదం

తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆయన...

Updated : 20 Jul 2021 20:05 IST

హైదరాబాద్‌: తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌)కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆయన దరఖాస్తును పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పదవీ విరమణకు అనుమతిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు నెలలు ముందుగా నోటీస్ ఇవ్వాలన్న నిబంధనను ప్రభుత్వం మినహాయించింది. స్వచ్ఛంద పదవీ విరమణకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రవీణ్ కుమార్‌ను విధుల నుంచి రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్‌ను గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని