Ts News: విద్యాసంస్థల్లో కరోనా వ్యాప్తిపై ఆందోళన వద్దు: సబిత ఇంద్రారెడ్డి

విద్యా సంస్థల్లో కరోనా వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, పకద్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు

Updated : 07 Dec 2021 16:05 IST

హైదరాబాద్‌: విద్యా సంస్థల్లో కరోనా వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, పకద్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు ఏమీ లేవని స్పష్టం చేశారు. పాఠశాలలు, వసతి గృహాల్లో నూరు శాతం రెండు డోసులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులను మంత్రి ఆదేశించారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌, ఒమిక్రాన్‌ వేరియంట్‌పై జడ్పీ కార్యాలయంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్షించారు.

‘‘రంగారెడ్డి జిల్లాలో ప్రాంతియేతరులు సహా అందరికీ టీకాలు అందించాం. రెండో డోసు విషయంలో ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయించాలి. విద్యా సంస్థల్లో ప్రస్తుతం ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు లేవు. కేసుల నమోదుపై సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న దష్ప్రచారాన్ని నమ్మొద్దు. అక్కడక్కడా స్పల్పంగా కేసులు నమోదు అవుతున్నాయి. వ్యాక్సినేషన్‌ వంద శాతం జరిగేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి. సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా రెండు డోసులు తీసుకోవాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి. పాఠశాలల్లో కొవిడ్‌ ప్రమాణాలు పాటించేలా చూడాలి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే విద్యార్థులు రెండేళ్లు నష్టపోయారు. విద్యార్థుల భవిష్యత్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రభుత్వం తప్పకుండా సమీక్షించి సరైన నిర్ణయం తీసుకుంటుంది’’ అని సబిత పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని