TS News: ఉద్యోగుల కేటాయింపునకు షెడ్యూల్‌ ప్రకటన విడుదల

కొత్త జోనల్‌ విధానం మేరకు ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి షెడ్యూల్‌ ప్రకటన విడుదలైంది.

Updated : 14 Dec 2021 12:14 IST

హైదరాబాద్‌: కొత్త జోనల్‌ విధానం మేరకు ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి షెడ్యూల్‌ ప్రకటన విడుదలైంది. జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ కేడర్‌ ఉద్యోగుల నుంచి 16న ఐచ్ఛికాల స్వీకరణను ప్రారంభించింది. ఈ నెల 20 నుంచి కేటాయింపు ఉత్తర్వులు ఇవ్వనున్నారు. కేటాయింపు ఉత్తర్వుల తర్వాత విధుల్లో చేరేందుకు వారం గడువు ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానంలో భాగంగా సొంత జిల్లాలు, జోన్లు, బహుళ జోన్లకు వెళ్లేందుకు ఉద్యోగులు, అధికారులకు అవకాశం కల్పించగా.. వీటికోసం 60 వేల మంది ఐచ్ఛికాలు (ఆప్షన్లు) సమర్పిస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని