Ts News: ఆర్టీసీ బస్సులు రావడం లేదు.. జస్టిస్‌ ఎన్వీ రమణకు విద్యార్థిని ఫిర్యాదు

మీ ఊరికి సరైన సమయానికి ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో నిత్యం పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు, వివిధ రకాల పనులపై వెళ్లే వారు ఇబ్బందులు పడుతుంటారు

Updated : 04 Nov 2021 11:51 IST

హైదరాబాద్‌: మీ ఊరికి సరైన సమయానికి ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో నిత్యం పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు, వివిధ రకాల పనులపై వెళ్లే వారు ఇబ్బందులు పడుతుంటారు. ఏదో ఒక రోజు ఇలాంటి సమస్య వస్తే సర్లే కదా అని ఊరుకుంటాం. అయితే పదేపదే ఈ సమస్య ఇబ్బందికి గురిచేస్తే సంబంధిత ఆర్టీసీ డిపో అధికారులు లేదా స్థానిక ప్రయాణ ప్రాంగణంలో ఫిర్యాదు చేస్తాం. కానీ, పాఠశాలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు నడపడం లేదని ఓ విద్యార్థిని ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ దృష్టికి తీసుకెళ్లింది.

వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం చిడేడు గ్రామానికి చెందిన వైష్ణవి 8వ తరగతి చదువుతుంది. తాను పాఠశాలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు సరిగ్గా నడపడం లేదనే విషయాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ ఎన్‌వీ రమణ దృష్టికి తీసుకెళ్లింది. విద్యార్థిని అభ్యర్థనపై స్పందించిన సీజేఐ.. ఈ విషయాన్ని టీఎస్‌ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ బస్సులను తక్షణమే పునరుద్ధరించినట్లు వెల్లడించారు. బస్సుల పునరుద్ధరణపై అప్రమత్తం చేసినందుకు సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణకు సజ్జనార్ కృతజ్ఞతలు తెలియజేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని