sharannavaratri: సరస్వతీదేవిగా దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారు జన్మించిన మూలా నక్షత్రం కావడంతో దుర్గమ్మ.. సరస్వతీదేవీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. విశిష్ఠమైన రోజు కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీపై వాహనాల రద్దీ పెరిగింది. అర్ధరాత్రి రెండున్నర గంటల నుంచి దర్శనానికి క్యూలైన్లలో అనుమతించారు. అంతరాలయం, ప్రత్యేక దర్శ

Updated : 12 Oct 2021 13:03 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారు జన్మించిన మూలా నక్షత్రం కావడంతో దుర్గమ్మ.. సరస్వతీదేవీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. విశిష్ఠమైన రోజు కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీపై వాహనాల రద్దీ పెరిగింది. అర్ధరాత్రి రెండున్నర గంటల నుంచి దర్శనానికి క్యూలైన్లలో అనుమతించారు. అంతరాలయం, ప్రత్యేక దర్శనం టికెట్లు రద్దు చేసి అందరికీ ఉచితంగానే అమ్మవారి దర్శన అవకాశం కల్పిస్తున్నారు.

ఈ ఉదయం విధులకు హాజరయ్యేందుకు వచ్చిన అర్చకులు, ఇతర దేవాదాయ శాఖ సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అర్చకులు వాగ్వాదానికి దిగారు. దీంతో పాటు ఘాట్ రోడ్‌లో రెవెన్యూశాఖ, పోలీసులకు మధ్య వివాదం చెలరేగింది. విజయవాడ సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ నేరుగా రంగంలోని దిగి రెవెన్యూ అధికారుల వాహనాలను కొండపైకి పంపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని