Sharannavaratri: మహిషాసుర మర్దినిగా కనకదుర్గమ్మ అభయం

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఇవాళ ఎనిమిదో

Updated : 14 Oct 2021 12:18 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఇవాళ ఎనిమిదో రోజు కావడంతో అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసుర మర్దినిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అష్ట భుజాలతో అవతరించి సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించిందని పురాణాలు చెబుతున్నాయి. రేపటితో దసరా వేడుకలు ముగియనున్నందున ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. శుక్రవారం విజయదశమి పండుగ సందర్భంగా కనకదుర్గమ్మ రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని