Sharannavaratri: ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిగా అమ్మవారి అభయం

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ..

Updated : 13 Oct 2021 13:24 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఏడోరోజు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. లోక కంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవి స్వయంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతుంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. ఉత్సవాల నేపథ్యంలో దుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

దుర్గమ్మను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, డీజీపీ, అదనపు డీజీ, ఉన్నతాధికారులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానన్నారు. నిన్న మూలా నక్షత్రం సందర్భంగా లక్ష మందికిపైగా భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారని చెప్పారు. అధిక సంఖ్యలో వచ్చినా చివరి భక్తుడి వరకు దర్శనం కల్పించామని ఆయన తెలిపారు. 

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని