Ts News: సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి రాజీనామా

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకటరామరెడ్డి రాజీనామా చేశారు. ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన వెంకటరామరెడ్డి.. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు తన రాజీనామా లేఖ

Updated : 15 Nov 2021 17:20 IST

సిద్దిపేట: తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్‌కు రాజీనామా చేశారు. ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) కోరుతూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు రాజీనామా లేఖ అందించారు. వెంకట్రామిరెడ్డి వీఆర్‌ఎస్‌ ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే వెంకట్రామిరెడ్డి తెరాసలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో సిద్దిపేటలో సమీకృత కలెక్టరేట్‌ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెంకటరామరెడ్డి సీఎం కేసీఆర్‌ పాదాలకు నమస్కారం చేయడం చర్చనీయాంశమైంది.

రాజీనామా ఆమోదం అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేస్తోంది. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా సీఎం కేసీఆర్‌ తెలంగాణను తీర్చిదిద్దుతున్నారు. ఈ  అభివృద్ధి మార్గంలో సీఎంతో ఉండాలనుకొని వీఆర్‌ఎస్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. రానున్న వంద సంవత్సరాలు తెలంగాణ గురించి ప్రజలు చెప్పుకొనే విధంగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ పిలుపు వచ్చాక తెరాసలో చేరతాను. సీఎం మార్గనిర్దేశం ప్రకారం పని చేస్తాను’’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని