AP News: న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని అరెస్టు చేసిన సీబీఐ

న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈకేసులో తాజాగా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో

Published : 23 Oct 2021 01:24 IST

అమరావతి: న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈకేసులో తాజాగా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. ఈకేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకటసత్యనారాయణ, గూడ శ్రీధర్‌రెడ్డి, శ్రీనాథ్‌ సుస్వరం, కిషోర్‌ కుమార్‌ దరిస, సుద్దులూరి అజయ్‌ అమృత్‌లను అరెస్టు చేసినట్టు సీబీఐ వెల్లడించింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు గతేడాది నవంబర్‌ 11న దర్యాప్తు ప్రారంభించారు.  మొత్తం 16 మందిపై 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన సీఐడీ అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన అధికారులు గతంలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వేర్వేరుగా ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేశారు. ఈకేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపిన సీబీఐ తాజాగా ఆరుగురిని అరెస్టు చేసింది. విదేశాల్లో ఉన్న నిందితులపై ఏవిధంగా చర్యలు తీసుకోవాలో చూడాలని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా సీబీఐ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని