AP News: బెజవాడ ఇంద్రకీలాద్రిపై పాముకు దహన సంస్కారాలు

దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు ఓ పాముకు దహన సంస్కారాలు చేశారు. ఇంద్రకీలాద్రిపై సంచరిస్తున్న పాముల్లో ఒకటి మృతి చెందడంతో..

Published : 19 Dec 2021 01:30 IST

విజయవాడ: విజయవాడ దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు ఓ పాముకు దహన సంస్కారాలు చేశారు. ఇంద్రకీలాద్రిపై సంచరిస్తున్న పాముల్లో ఒకటి మృతి చెందడంతో శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రాంతాల్లో సర్పాలు చనిపోతే దహన సంస్కారాలు చేయాలని వైదిక కమిటీ సూచించింది. బెజవాడ ఇంద్రకీలాద్రిపై గత కొంతకాలంగా తిరుగుతున్న ఓ సర్పం మృతి చెందడంతో కొండ దిగువన ఉన్న దుర్గాఘాట్‌లోకి తీసుకొచ్చి శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు పూర్తి చేశారు. రెండు సర్పాలు ఇంద్రకీలాద్రిపై గత కొంతకాలంగా కనిపిస్తున్నాయని, అయితే ఇటీవలే ఓ పాము కనిపించకుండా పోయిందని, ఆ పాము కొండ దిగువ ప్రాంతంలో టర్నింగ్‌ వద్ద చనిపోయి కనిపించిందని ఆలయ వైదిక కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దీంతో ఆ సర్పానికి మనుషుల మాదిరిగానే ... వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా దహన సంస్కారాల క్రతువు నిర్వహించారు. అనంతరం అస్తికలు కృష్ణానదిలో నిమజ్జనం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని