Aadhaar: SMSతోనూ ఆధార్‌ సేవలు

ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్ నుంచి కేవలం ఎస్‌ఎంఎస్‌ల ద్వారానే  కొన్ని సేవలను పొందవచ్చు. దీనికి కేవలం రీఛార్జ్‌ ఉంటే చాలు. అయితే ఎం-ఆధార్‌ యాప్‌, రెసిడెంట్ పోర్టల్‌ను...

Updated : 14 Jul 2021 14:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆధార్‌ సర్వీసెస్‌ ఆన్‌ ఎస్‌ఎంఎస్‌’.. ఇప్పటికే అర్థమైపోయి ఉండాలే... ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్ నుంచి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కొన్ని సేవలను పొందవచ్చు. దీనికి కేవలం రీఛార్జ్‌ ఉంటే చాలు. అయితే ఎం-ఆధార్‌ యాప్‌, రెసిడెంట్ పోర్టల్‌ను వినియోగించి ఒకేసారి పొందవచ్చు కదా.. అని మీరు అనుకోవచ్చు. అయితే దానికి ఇంటర్నెట్‌ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. మొబైల్‌ డేటాలో సమస్య ఉంటే ఇక అంతే సంగతులు.. అలాంటప్పుడు సంక్షిప్త సందేశాలతో ఆధార్‌ సేవలు లభిస్తే బాగుంటుందిగా. యూఐడీఏఐ వారి 1947 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సేవలను పొందవచ్చు. మరి ఏవేమి సర్వీసులు, ఏ విధంగా ఎస్‌ఎంఎస్‌ల వల్ల ఎలా పొందవచ్చో తెలుసుకుందాం..

వర్చువల్‌ ఐడీ (VID) జనరేషన్‌

ఈ-కేవైసీ అప్‌డేట్‌ సమయంలో అవసరమైన వర్చువల్‌ ఐడీ (VID) జనరేషన్‌తోపాటు రిట్రీవ్‌ను కేవలం ఎస్‌ఎంఎస్‌ ద్వారా చేసుకునే వెసులుబాటును ఉడాయ్‌ కల్పించింది. వీఐడీని జనరేట్‌ చేయాలంటే.. ఆధార్‌ నంబర్‌ చివరి నాలుగు అంకెలు జీవీఐడీ అని సంక్షిప్త సందేశం 1947 నంబర్‌కు పంపాలి. (ఉదాహరణకు 00xxGVID అని 1947కు ఎస్‌ఎంఎస్‌ చేయాలి)

VID రీట్రీవ్‌ చేసుకోవాలంటే..

దీని కోసం రెండు మార్గాలు ఉన్నాయి. అందులో ఆధార్‌ నంబర్‌, వర్చువల్‌ ఐడీ నంబర్‌లను వినియోగించి ఓటీపీ ద్వారా రీట్రీవ్‌ చేసుకునే సదుపాయం ఉంది. ఆధార్‌ నంబర్‌ ఆఖరి నాలుగు అంకెలు లేదా వర్చువల్‌ ఐడీ చివరి ఆరు డిజిట్స్‌ సాయంతో ఓటీపీని జనరేట్‌ చేసుకుని రీట్రీవ్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు 00xxRVID/00xxxxRVID అని టైప్‌ చేసి 1947 నంబర్‌కు సంక్షిప్త సందేశం పంపితే సరిపోతుంది.

ఆధార్‌ను లాక్‌ చేయండిలా...

ఆధార్‌ను లాక్‌ చేయాలంటే తప్పనిసరిగా వీఐడీ ఉండాలి. వీఐడీ జనరేషన్‌ తర్వాత కేవలం రెండు స్టెప్స్‌లో ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఆధార్‌ను లాక్‌ చేసేయవచ్చు.ఉదాహరణకు: మొదటి ఎస్‌ఎంఎస్‌ 00xxGETOTP(ఆధార్‌ చివరి నాలుగు అంకెలు) అని 1947కి సంక్షిప్త సందేశం పంపాలి. ఓటీపీ వచ్చాక వెంటనే LOCKUID (స్పేస్‌) ఆధార్‌ ఆఖరి నాలుగు అంకెలు (స్పేస్‌) ఆరు అంకెల ఓటీపీని ఎంటర్‌ చేసి రిజిస్టర్‌ మొబైల్‌నంబర్‌ నుంచి ఉడాయ్‌ అధికారిక హెల్ప్‌లైన్‌ 1947కి సెండ్‌ చేయాలి. ఒక వేళ మొబైల్‌ నంబర్‌ మరియు ఆధార్‌ చివరి నాలుగు అంకెలు ఒకటే అయితే.. ఆధార్‌లోని ఆఖరి ఎనిమిది అంకెలను యాడ్‌ చేయాలి.

చాలా సింపుల్‌గా అన్‌లాక్‌

తొలుత ఓటీపీని జనరేట్‌ చేయాలి. దాని కోసం GETOTP... ఆఖరి ఆరు అంకెల వీఐడీని యాడ్‌ చేసి 1947కి ఎస్‌ఎంఎస్‌ చేయాలి. వచ్చిన ఓటీపీని జాగ్రత్తగా ఉంచుకుని.. మరొక ఎస్‌ఎంఎస్‌ రూపంలో UNLOCKUID (స్పేస్‌) చివరి ఆరు అంకెల వీఐడీ (స్పేస్‌) ఓటీపీని ఎంటర్‌ చేసి 1947 హెల్ప్‌లైన్‌కు రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ను పంపించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని