AP News: సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల స్కాం.. తెరపైకి ప్రజాప్రతినిధులు పీఏలు, అనుచరులు!

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కుల పంపిణీ కుంభకోణంలో మరికొందరి ప్రమేయం ఉందని అనిశా తేల్చింది...

Updated : 22 Sep 2021 14:19 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కుల పంపిణీ కుంభకోణంలో మరికొందరి ప్రమేయం ఉందని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తేల్చింది. ఏపీ సచివాలయంలోని కొందరి ఉద్యోగుల పాత్రను ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రూ.117 కోట్లు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని ఏసీబీ అధికారులు గతంలోనే గుర్తించారు. దీనికి సంబంధించి గతేడాది సెప్టెంబర్‌లో ఈ కేసు నమోదైంది. కాగా, ఈ కుంభకోణంలో మరికొందరి పాత్ర ఉన్నట్లు.. ఆస్పత్రుల నుంచి సేకరించిన సమాచారంతో నిధులు స్వాహా చేసినట్లు తాజాగా గుర్తించారు. ప్రజాప్రతినిధుల పీఏలు, అనుచరుల ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ తేల్చినట్లు తెలుస్తోంది.  ఈ వ్యవహారంలో సుమారు 50 మంది ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు