Hyderabad news: జీహెచ్‌ఎంసీ పరిధిలో కొవిడ్‌ టీకాల ప్రత్యేక డ్రైవ్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో సోమవారం నుంచి కొవిడ్‌ టీకాల ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగనుంది. జీహెచ్‌ఎంసీలో వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యంగా చేపట్టనున్న ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహణపై ...

Updated : 27 Feb 2024 15:58 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో సోమవారం నుంచి కొవిడ్‌ టీకాల ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగనుంది. జీహెచ్‌ఎంసీలో వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యంగా చేపట్టనున్న ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహణపై  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక డ్రైవ్‌ కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో 150, కంటోన్మెంట్‌ పరిధిలో 25 సంచార టీకా వాహనాలు సమకూర్చనున్నారు. కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయించుకోని వారిని గుర్తించనున్నారు. టీకాలు వేయించుకున్న వారి ఇళ్లకు సిబ్బంది ప్రత్యేక స్టిక్కర్లు అంటిస్తారు. టీకాల కార్యక్రమంపై విస్తృత అవగాహన కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 100శాతం టీకాలు పూర్తయిన కాలనీలకు జీహెచ్‌ఎంసీ ప్రశంసా పత్రాలు ఇవ్వనుంది. టీకాల ప్రత్యేక డ్రైవ్‌ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. 10.. 15 రోజుల పాటు ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగనుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని