Train: దసరా ప్రయాణికులకు మరో మూడు పండగ ప్రత్యేకరైళ్లు

దసరా పండక్కి రాకపోకలు సాగించే ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మరో మూడు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 14న రాత్రి 11.55

Published : 13 Oct 2021 08:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: దసరా పండక్కి రాకపోకలు సాగించే ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మరో మూడు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 14న రాత్రి 11.55 గంటలకు సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌ (నం.07550), 17న రాత్రి 9.05 గంటలకు మచిలీపట్నం-సికింద్రాబాద్‌ (నం.07450), 18న రాత్రి 10.45 గంటలకు లింగంపల్లి-విజయవాడ (నెం.07451) రైళ్లు బయల్దేరుతాయని పేర్కొంది. ‘దసరా పండగ ప్రత్యేక రైళ్లు’గా వీటిని నడిపించనుంది. సికింద్రాబాద్‌-కాకినాడ రైలు కాజీపేట, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు మీదుగా మిగతా రెండు రైళ్లు కాజీపేట, ఖమ్మం, విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని