Ap News: భారీ వర్షాలకు ధ్వంసమైన శ్రీవారి మెట్ల మార్గం

గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తోన్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. చిత్తూరు జిల్లా తిరుపతి, తిరుమలలో కురిసిన భారీ వర్షాలకు మాడవీధులు

Updated : 19 Nov 2021 16:02 IST

తిరుపతి: గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తోన్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. చిత్తూరు జిల్లా తిరుపతి, తిరుమలలో కురిసిన భారీ వర్షాలకు మాడవీధులు చెరువులను తలపించేలా వరద నీటితో నిండిపోయాయి. నడక మార్గాల్లో పెద్ద ఎత్తున చెట్లు కూలిపోవడంతో పాటు కొండచరియలు విరిగిపడుతున్నా్యి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను తితిదే మూసేసింది. నిన్నంతా కురిసిన భారీ వర్షానికి శ్రీవారి మెట్ల మార్గం మొత్తం ధ్వంసమైంది. బండరాళ్లతో నిండిపోయింది. కొండల్లోని చెత్తాచెదారం, మట్టి మెట్ల మార్గం వద్ద పేరుకుపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని