KTR: అంకురాల కోసం ప్రత్యేకంగా ‘స్టార్టప్ తెలంగాణ పోర్టల్’: కేటీఆర్

అంకురాల కోసం ప్రత్యేకంగా ‘స్టార్టప్ తెలంగాణ’ పోర్టల్‌ను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ హైచ్‌ఐసీసీలో ఐటీ

Updated : 16 Sep 2021 21:41 IST

హైదరాబాద్‌: అంకురాల కోసం ప్రత్యేకంగా ‘స్టార్టప్ తెలంగాణ’ పోర్టల్‌ను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ హైచ్‌ఐసీసీలో ఐటీ పాలసీ విడుదల చేసిన సందర్భంగా.. స్టార్టప్ ఎకోసిస్టం బలోపేతం కోసం రూపొందించిన ఈ ప్రత్యేక పోర్టల్‌ను కేటీఆర్‌ ఆవిష్కరించారు. తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టం మొత్తానికి ఈ పోర్టల్ వన్ స్టాప్ డెస్టినేషన్‌గా నిలుస్తుందన్నారు. స్టార్టప్‌లకు సంబంధించిన సర్వీసులు అందించటం ఈ పోర్టల్ మఖ్య ఉద్దేశం. అందులో భాగంగా అంకురాల గుర్తింపు, మార్గదర్శనం, రాయితీలు అందించటం, ప్రభుత్వ సహకారం.. ఇలా అన్నింటినీ ఈ పోర్టల్ పర్యవేక్షిస్తుందని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే జీవోలు, పాలసీలు, సర్కులర్లు, పథకాలు అన్నీ ఈ పోర్టల్‌లో పొందుపరచనున్నట్లు స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని