Ganesh Immersion: ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనంపై సుప్రీంకు తెలంగాణ ప్రభుత్వం! 

వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనుంది.

Updated : 14 Sep 2021 09:28 IST

హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌లో పీవోపీ (ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌) వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నిమజ్జనానికి సంబంధించి ఇచ్చిన తీర్పులోని అంశాలను సవరించాలన్న విజ్ఞప్తికి హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు తీర్పు, తదుపరి కార్యాచరణ, ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించారు.

వేలాది విగ్రహాలు, భక్తుల మనోభావాలు, ప్రస్తుత పరిస్థితులు, తదితర అంశాల దృష్ట్యా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లాలని సమీక్షలో నిర్ణయించినట్లు సమాచారం. వాస్తవ పరిస్థితులను సుప్రీం దృష్టికి తీసుకెళ్లాలని.. నిమజ్జనానికి అనుమతి కోరాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేయనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని