AP News: కాకినాడ కలెక్టరేట్‌ వద్ద పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఐడియల్‌ ఎయిడెడ్‌ కళాశాల విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన నిర్వహించారు.

Updated : 12 Nov 2021 17:22 IST

కాకినాడ కలెక్టరేట్‌: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఐడియల్‌ ఎయిడెడ్‌ కళాశాల విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. తమ కళాశాలను ప్రైవేటీకరించవద్దని నిరసన చేపట్టారు. సామర్లకోట రోడ్డులోని కళాశాల వద్ద నుంచి వందలాది మంది విద్యార్థులు ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకొని ముట్టడించారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కలెక్టరేట్‌కు అడ్డంగా ఉంచిన బారీకేడ్లను తోసుకొని విద్యార్థులు లోనికి చొచ్చుకెళ్లారు. 

ఈ సందర్భంగా పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను నిలువరించిన పోలీసులు.. కలెక్టరేట్‌ లోపలి నుంచి బయటకు పంపి ప్రధాన ద్వారాన్ని మూసేశారు. దీంతో భారీవర్షంలోనే విద్యార్థులు కలెక్టరేట్‌ ఎదుట నిరసన కొనసాగించారు. జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌ సత్తిబాబు విద్యార్థుల వద్దకు వచ్చి చర్చించారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని