
AP News: మోపిదేవిలో వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణోత్సవం
మోపిదేవి: సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా కృష్ణా జిల్లా మోపిదేవిలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవం సందర్భంగా ఉదయం నుంచి శ్రీవల్లీ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామివారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. అర్చకులు వేదమంత్రోచ్ఛరణల మధ్య ఈ కార్యక్రమాన్ని జరిపించారు. అంతకుముందు నందివాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ లీలా కుమార్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
సుబ్రహ్మణ్యేశ్వర సుప్రభాతం సీడీ ఆవిష్కరణ
సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా డాక్టర్ తాలపర్తి శ్యామలానంద ప్రసాద్ రచించి ఆలపించిన స్వామివారి సుప్రభాత సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామివారి విశిష్టతను శ్యామలానంద ప్రసాద్ భక్తులకు వివరించారు.
దర్శించుకున్న మంత్రి వేణుగోపాలకృష్ణ
కల్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగదేవతకు పూజలు నిర్వహించిన అభిషేకాలు చేశారు. మంత్రికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ సహాయ కమిషనర్ లీలాకుమార్ స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Nikhil: లైవ్ ఈవెంట్లో అభిమానికి నిఖిల్ సూపర్ గిఫ్ట్.. ఆ తర్వాత ఏం చేశారంటే..!
-
India News
Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19 ఏళ్లు వేదన అనుభవించారు..!
-
Politics News
Maharashtra Political Crisis: కొనసాగుతోన్న ‘మహా’ అనిశ్చితి.. శిందే కంచుకోటలో 144 సెక్షన్
-
Movies News
Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణ’ సినిమాలు..‘చారాణ’ కలెక్షన్లు!
-
Politics News
Andhra News: చర్యలు తీసుకోకుండా సాక్షులను బెదిరిస్తున్నారు.. డీజీపీకి చంద్రబాబు లేఖ
-
Politics News
Maharashtra Crisis: శివసేనను భాజపా అంతం చేయాలనుకుంటోంది: ఉద్ధవ్ ఠాక్రే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Super Tax: పాక్లో ‘సూపర్’ పన్ను!
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
- IND vs LEIC Practice Match : భళా అనిపించిన భారత బౌలర్లు.. మెరిసిన పంత్