Supreme Court: ఏపీ మంత్రి సురేశ్‌ దంపతులకు సుప్రీంలో చుక్కెదురు

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని

Updated : 08 Oct 2021 11:55 IST

 

దిల్లీ: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

2016లో చేపట్టిన సోదాల్లో పలువురు ఐఆర్‌ఎస్‌ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. దీనిలో భాగంగానే మంత్రి సురేశ్‌, ఆయన  సతీమణి, ఐఆర్‌ఎస్‌ అధికారిణి టీఎన్‌ విజయలక్ష్మిపై కేసు నమోదు చేసింది. 2010-16 సంవత్సరాల మధ్య సురేశ్‌ దంపతుల ఆదాయం రూ.4.84 కోట్ల కంటే 22 శాతం అదనంగా రూ.5.95 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు సీబీఐ గుర్తించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని