Ts News: ఫ్రాన్స్‌ పర్యటనలో కేటీఆర్‌ను కలిసిన ఆత్మీయ అతిథి

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఫ్రాన్స్‌ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పారిస్‌ వెళ్లిన కేటీఆర్‌ను ఓ ఆత్మీయ అతిథి కలిశారు. మూడు దశాబ్దాలకుపైగా

Updated : 31 Oct 2021 19:57 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఫ్రాన్స్‌ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పారిస్‌ వెళ్లిన కేటీఆర్‌ను ఓ ఆత్మీయ అతిథి కలిశారు. మూడు దశాబ్దాలకుపైగా తెలుగు భాషపై పరిశోధన చేస్తూ, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలిగిన ప్రొఫెసర్ డానియేల్ నెగర్స్.. ఆ అనుకోని ఆత్మీయ అతిథి. ఫ్రెంచ్ యూనివర్సిటీకి చెందిన ‘‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్స్’’లో దక్షిణ ఆసియా, హిమాలయన్ స్టడీస్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గత కొన్నేళ్లుగా తాను తెలుగు భాషపై చేస్తున్న పరిశోధనకు సంబంధించిన వివరాలను కేటీఆర్‌కు వివరించారు. వేల మైళ్ళ దూరాన ఉండి కూడా తెలుగు భాషపై చూపిస్తున్న మమకారం నిజంగా స్ఫూర్తిదాయకమన్న కేటీఆర్‌.. నెగర్స్‌ను ప్రశంసించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని