Azharuddin: అజహర్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులు మళ్లీ తెరవాలి: గురువారెడ్డి

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించినందుకు తమపై మహమ్మద్‌

Updated : 13 Aug 2021 13:44 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించినందుకు తమపై మహమ్మద్‌ అజహరుద్దీన్‌ పరువు నష్టం దావా వేశారని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ (టీసీఏ) కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో గురువారెడ్డి మాట్లాడుతూ రూ.రెండుకోట్లకు తమపై అజహరుద్దీన్‌ సివిల్‌ సూట్‌ వేశారని.. ఫేస్‌బుక్‌లో ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం దావా వేశారని చెప్పారు.

అజహర్‌పై ఉన్న మ్యాచ్‌ఫిక్సింగ్‌ కేసులను మళ్లీ తెరవాలని.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అజహర్‌ వేసిన పరువునష్టం దావాపై తాము కౌంటర్‌ వేశామని.. ఇప్పటి వరకు ఆయన నుంచి సమాధానం లేదన్నారు. బీసీసీఐ ఆదేశాలను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా చెప్పుకొంటున్న అజహరుద్దీన్‌ పాటించడం లేదని గురువారెడ్డి ఆరోపించారు. హెచ్‌సీఏలో ఆయన చేసిన అక్రమాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని