AP News: రాజమహేంద్రవరం జైలుకు పట్టాభి తరలింపు

సీఎం జగన్‌ను పరుష పదజాలం చేశారంటూ నమోదైన కేసులో అరెస్టయిన తెదేపా నేత కొమ్మారెడ్డి

Updated : 22 Oct 2021 15:22 IST

మచిలీపట్నం: సీఎం జగన్‌పై పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో అరెస్టయిన తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను మచిలీపట్నం జైలు నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో విజయవాడ కోర్టు పట్టాభికి గురువారం 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఆయన్ను మచిలీపట్నం జైలుకు తీసుకెళ్లారు. అనంతరం ఈరోజు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసు బందోబస్తు మధ్య రాజమహేంద్రవరం తరలించారు. మరోవైపు పట్టాభి బెయిల్‌ పిటిషన్‌ను ఆయన తరఫు న్యాయవాదులు ఇవాళ దాఖలు చేయనున్నారు. ఆయన్ను ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కూడా పిటిషన్‌ దాఖలు చేసే అవకాశముంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని