దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులు బోనం తీసుకొచ్చారు.

Updated : 20 Jul 2021 18:43 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులు బోనం తీసుకొచ్చారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని బంగారు పాత్రలో బోనం సమర్పించారు. ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ  వైభవంగా జరుగుతుంది. హైదరాబాద్‌ పాతబస్తీలో కొలువైన శ్రీ మహంకాళీ అమ్మవారి ఆలయం నుంచి ఏటా సప్త మాతృకలకు సప్త బంగారు బోనాలు సమర్పిస్తారు. ఇందులో భాగంగా వరుసగా 12 ఏట తెలంగాణ నుంచి బోనాలు సమర్పించేందుకు భక్తులు విజయవాడకు వచ్చారు.

దుర్గ గుడి ఈవో భ్రమరాంబ, పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, సభ్యులు ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. మేళతాళాల మధ్య బోనాన్ని ఎత్తుకున్న భక్తులు ఆనంద తాండవం చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ కార్యక్రమంలో 250 మంది భక్తులు పాల్గొనడానికే అనుమతిచ్చారు. ఈ నెల 30న కనక దుర్గమ్మ ఆలయం నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్‌లో వెలసిన అమ్మవార్లకు బోనం తీసుకెళ్లనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని