CM KCR: దళితబంధు కేవలం కార్యక్రమం కాదు.. ఉద్యమం: కేసీఆర్‌

దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు.

Updated : 24 Sep 2022 15:17 IST

హైదరాబాద్‌: దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న ఈ కార్యక్రమంపై ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎస్సీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి సీఎం మాట్లాడారు. దళితబంధు లక్ష్యాలు, అమలు, కార్యాచరణపై కేసీఆర్‌ వారికి దిశానిర్దేశం చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దీన్ని విజయవంతం చేయాలని కోరారు.

దళితబంధు అమలు ప్రభావం యావత్‌ తెలంగాణపై ఉంటుందని.. దీని విజయవంతానికి అందరూ దృఢ నిర్ణయం తీసుకోవాలన్నారు. నమ్మిన ధర్మానికి కట్టుబడి కొనసాగితే విజయం సాధ్యమని.. మనలో పరస్పర విశ్వాసం, సహకారం పెరగాలని సూచించారు. పరస్పర సౌభ్రాతృత్వం పెంచుకుంటేనే విజయానికి బాటలు పడతాయని సీఎం చెప్పారు. దళితవాడల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని, పది రోజుల్లో దళితుల భూ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. హుజూరాబాద్‌లో భూ సమస్యల పరిష్కానికి కలెక్టర్‌ ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలన్నారు. హుజూరాబాద్‌లో ఇల్లులేని దళిత కుటుంబం ఉండకూడదన్నారు. ఖాళీ స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.  రాష్ట్రవ్యాప్తంగా దళితులకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం చేస్తామన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని