Ts corona Update: తెలంగాణలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు
తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 79కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 123 మంది శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్జీఐఏ) చేరుకున్నారు. వారందరికీ కొవిడ్ ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేయగా 10 మంది ప్రయాణికులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు.
ఇప్పటివరకు ఎట్ రిస్క్, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 12,692 మంది ప్రయాణికులకు ఆర్జీఐఏలో కొవిడ్ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేశారు. వారిలో 144 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్‌ని అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. వారిలో 44 మందికి ఒమిక్రాన్ నెగెటివ్‌గా తేలింది. మిగిలిన 100 మందిలో ఇప్పటివరకు 79 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 21 మంది ఫలితాలు రావాల్సి ఉందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. చికిత్స అనంతరం ఒమిక్రాన్ బాధితుల్లో 27 మంది కోలుకున్నారు.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 28,886 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 317 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,82,215కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,029కు చేరింది. కరోనా బారి నుంచి నిన్న 232 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,733 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం