CS Somesh Kumar: పాఠశాలల్లో వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తవ్వాలి: సీఎస్‌

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, సిబ్బంది అందరికీ వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్ కుమార్ ఆదేశించారు..

Published : 04 Sep 2021 01:22 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, సిబ్బంది అందరికీ వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్ కుమార్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ, పంచాయతీ అధికారులతో పాఠశాలల పున:ప్రారంభంపై సీఎస్‌ సమీక్షించారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఉపాధ్యాయులతో పాటు బోధనేతర సిబ్బంది, స్కూల్ బస్ డ్రైవర్లు, మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది అందరికీ టీకాలు వేయించాలని అధికారులకు సీఎస్‌ స్పష్టం చేశారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు, కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నట్లుగా పాఠశాలల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల్లో పూర్తి స్థాయిలో కొవిడ్ నిబంధనలు పాటించాలని, పరిశుభ్రత చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే పరీక్షలు చేయించాలన్నారు. మధ్యాహ్న భోజనం విషయంలో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల సిబ్బంది, వారితో సంబంధం ఉన్న వారికి టీకాలు వేయించేందుకు ఆర్బీఎస్కే వాహనాలను వినియోగించుకోవాలని సీఎస్ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని